మన్యం న్యూస్ చండ్రుగొండ,సెప్టెంబర్ 14 : మానవత్వం మంట కలిసింది… భర్తతో ఏడు అడుగులు వేసిన భార్య పరాయి వ్యక్తి మోజులో పడి… వేరే వ్యక్తితో వెళ్ళిపోయింది. అవమానంగా భావించిన అభర్త పురుగుల మందు సేవించి బలవన్మరణం చెందాడు. హృదయ విధారకర సంఘటన మండల పరిధిలో గల మంగయ్యబంజర్ లో చోటు చేసుకుంది.మంగయ్యబంజర్ గ్రామానికి చెందిన బూరుగు రాజేంద్ర(40) పురుగు మందు తాగి మృతి చెందాడు.చండ్రుగొండ ఎస్ఐ మాచినేని రవి గురువారం తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మృతుడు రాజేంద్రకు ఇద్దరు సంతానం, కూతురు నీల ఎవరికి చెప్పకుండా మహబూబాబాద్ కు చెందిన ఇద్దరు పిల్లలున్న వ్యక్తిని 15 రోజుల క్రితం వివాహం చేసుకుంది. అప్పటి నుంచి మృతుడు మద్యానికి బానిసైపోయాడు. మనస్థాపానికి గురై బుధవారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం కొత్తగూడెం ఏరియా ఆస్పత్రికి తరలించారు. గురువారం ఉదయం చికిత్స పొందుతూ- మృతి చెందాడు. మృతునికి భార్య సుజాత, కొడుకు దినేష్ ఉన్నారు. మృతుని కుమారుడు దినేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. శవానికి కొత్తగూడెం ఏరియా ఆస్పత్రిలో పోష్టుమార్టం నిర్వహించినట్లు ఎస్ఐ రవి తెలిపారు.