మన్యం న్యూస్ దుమ్ముగూడెం సెప్టెంబర్ 14::
మండల పరిధిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో హిందీ భాషా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. భాషా దినోత్సవం పురస్కరించుకొని ఇంచార్జ్ కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో హిందీ అధ్యాపకులు పి శ్రీనివాసరావును సత్కరించి హిందీ బాషా గొప్పతనాన్ని వివరించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ మాట్లాడుతూ.. దేశ భాష హిందీ గొప్పదనాన్ని దేశం ఐక్యతను కాపాడడంలో భాషకు ఉన్న ప్రాధాన్యతను విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.