UPDATES  

 కొత్తపల్లి గ్రామాన్ని సందర్శించిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ జే వి ఎల్ శిరీష

కొత్తపల్లి గ్రామాన్ని సందర్శించిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ జే వి ఎల్ శిరీష

* గ్రామలలో నెలకొన్న అపరిశుభ్ర పరిస్థితులే జ్వరాలకు కారణం

*ఆర్ఎంపీలు పరిధి దాటి వైద్యం చేయరాదు
*డి ఎం అండ్ హెచ్ ఓ జే వి ఎల్ శిరీష

మన్యం న్యూస్,చర్ల( సెప్టెంబర్ 14): చర్ల మండలంలోని పలు గ్రామాలలో నెలకొన్న అపరిశుభ్ర పరిస్థితులే ఆయా గ్రామాలలో జనాల తీవ్రతకు కారణమని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ జేవిఎల్ శిరీష అన్నారు. ఆమె గురువారం డిప్యూటీ డిఎం అండ్ హెచ్ ఓ రాజ్ కుమార్ తో కలిసి కొత్తపల్లి గ్రామంలో నిర్వహించే హెల్త్ క్యాంపు ను సందర్శించారు. ఈ సందర్భంగా డాక్టర్ శిరీష మాట్లాడుతూ గ్రామంలో ఎటుచూసినా అపారిశుధ్యమే కనబడుతుందని గ్రామంలో ఇలా ఉంటే జ్వరాలు రావా అంటూ స్థానిక గ్రామ పెద్దలను పిలిచి చర్చించారు. ప్రజలు వ్యక్తిగత, పరిసరాల శుభ్రత పాటిస్తేనే ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. మండలంలోని చర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని కొత్తపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ఉచిత ఆరోగ్య వైద్య శిబిరాన్ని సందర్శించారు. గ్రామస్తులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. అనంతరం మాట్లాడుతూ ప్రజలు వర్షాకాలంలో వచ్చే వ్యాధుల గురించి అవగాహన కలిగి ఉండాలన్నారు. సీజన్ ముగిసే వరకు వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించి రోగాలు దరి చేరకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు.అనంతరం జ్వరాలతో బాధపడుతున్న వారి యొక్క ఇండ్లను సందర్శించి వారి యొక్క ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు. మందులు సక్రమంగా వేసుకోవాలని, దోమలు కుట్టకుండా దోమతెరలు వాడాలని మరియు ఇంటి చుట్టూ నీరు నిలవకుండా చూసుకోవాలని, అదేవిధంగా ఇంటి పరిసరాలలో వాడి పడేసిన కొబ్బరి బోండాలు ,టైర్లు, పగిలిన కుండలు, ప్లాస్టిక్ బకెట్లు, లేకుండా చూసుకోవాలని ప్రజలకు అవగాహన కల్పించారు, అనంతరం అక్కడి నుంచి చర్ల లో ఉన్న పీహెచ్సీ ని సందర్శించారు. అక్కడ అందుతున్న వైద్యంపై రోగులను అడిగి తెలుసుకున్నారు. వైద్యులతో మాట్లాడుతూ. గ్రామంలో జరుగుతున్న ఫీవర్ సర్వే మరియు యాంటీ లార్వా ఆపరేషన్ కార్యక్రమాలపై, వైద్య సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ.ఫీవర్ సర్వే సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు , గ్రామంలో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపు ను గ్రామంలో జ్వరాల సంఖ్య తగ్గేవరకు కొనసాగించాలని, జ్వరంతో బాధపడుతున్న వారి నుండి బ్లడ్ శాంపిల్స్ సేకరించి పరీక్షల కొరకు పంపించాలని మరియు జ్వరంతో బాధపడుతున్న వారి నుండి రక్త పూతలు సేకరించాలని, వైద్యాధికారికి ఆరోగ్య సిబ్బందికి సూచించారు.

ఆర్ ఎం పి లు పరిధి దాటి వైద్యం చేయరాదు….. డి ఎం అండ్ హెచ్ ఓ శిరీష

మండలంలో ఉన్న ఆర్ఎంపీలు పరిధి దాటి వైద్యం చేయరాదని సీజన్లో వచ్చే జ్వరాలను డెంగ్యూ అని ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి ఆర్ఎంపీలు హై డోస్ లు ఇచ్చి ప్రజల్ని ఇబ్బంది పెట్టవద్దని అన్నారు. పరిధి దాటి వైద్యం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఆర్ఎంపీలపై కేసులు పెట్టటానికి కూడా వెనకాడబోమని తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ శ్రీధర్,
డా.కాంత్,డి.పి. ఎం. ఓ లు సత్య నారాయణ, ముత్యాల రావు,శ్రీనివాస రావు,హెచ్.ఈ. ఓ లు వేణు గోపాల కృష్ణ,కృష్ణయ్య,హనుమంత్, హెల్త్ సూపర్వైజర్ రాంప్రసాద్,వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !