అర్హులైన గిరిజనులకి, గిరిజనేతతులకు గృహలక్ష్మి పథకం వర్తింపజేయాలి…
ఎంపీటీసీ గట్ల లక్ష్మి…
బయ్యారం, మన్యం న్యూస్ : తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న గృహలక్ష్మి పథకాన్ని బయ్యారం మండలంలో అర్హులైన గిరిజనులకు, గిరిజనేతరులకు వర్తింపజేయాలనీ రామగుండాల ఎంపీటీసీ గట్ల లక్ష్మి డిమాండ్ చేశారు. గురువారం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఇల్లు కట్టుకోవడానికి భూమిలేని నిరుపేదలకి ప్రభుత్వమే భూమి ఇచ్చి ఇల్లులు కట్టించి ఇవ్వాలని అన్నారు. అలాగే మండలంలో దరఖాస్తు చేసుకున్న నిరుపేద బీసీలందరికీ బీసీ బందు ఇవ్వాలని మాట్లాడారు. లేనియెడల పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు.