మన్యం న్యూస్ ఇల్లందు రూరల్:- ఇల్లందు మండలం రాఘబోయిన గూడెం బీఅర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు బానోతు నందు నాయక్ ఇటీవల అనారోగ్యానికి గురై ఖమ్మం లోని ఓ ప్రయివేటు హాస్పిటల్లో వైద్య పొందుతున్నాడు.ఈ విషయాన్ని తెలుసుకున్న ఇల్లందు నియోజకవర్గ శాసన సభ్యురాలు బానోత్ హరిప్రియ హరి సింగ్ నాయక్ గురువారంహాస్పటల్ కి వెళ్లి పరామర్శించి, ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. అన్ని విధాల అండగా ఉంటానని ఎమ్మెల్యే హామి ఇచ్చారు.