మన్యం న్యూస్ దుమ్ముగూడెం సెప్టెంబర్ 14::
బీఆర్ఎస్ ప్రభుత్వానికి తెలంగాణలో కాలం చెల్లిందని డీసీసీ అధ్యక్షులు, భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య ఆరోపించారు. గురువారం మండలంలోని పర్యటించిన ఆయన
సీఐటీయూసీ సంఘాల ఆధ్వర్యంలో చేపడుతున్న అంగన్వాడి టీచర్లు ,ఆయాల సమ్మెకు కాంగ్రెస్ పార్టీ తరుపునసంపూర్ణ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంగన్వాడి టీచర్ల,ఆయాల న్యాయమైన సమాస్6 పరిష్కరించాలని ,వారికి ఉద్యోగ భద్రత కల్పించకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెట్టి చాకిరి చేపించుకుంటుందని మండిపడ్డారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సమస్యలు తీరుస్తుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు లంక శ్రీనివాసరావు, సంగీతరావు, దేవా, అంగన్వాడి టీచర్లు కృష్ణవేణి, కమలాదేవి, నరసమ్మ తదితరులు పాల్గొన్నారు.