UPDATES  

 జేకే 5 ఓసి సివిక్ టెండర్ ని వెంటనే పిలిచి కార్మికులకు పని కల్పించాలి

 

కాంట్రాక్టు కార్మికుల రాష్ట్ర అధ్యక్షులు యాకూబ్ షావలి

మన్యం న్యూస్,ఇల్లందు:ఇల్లందు జేకే 5 ఓసి సివిక్ టెండర్ ఆగస్టు 16వ తారీఖున ముగిసిందని వెంటనే టెండర్ పిలవాలని ప్రగతిశీల సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఇప్ట్యూ ఆధ్వర్యంలో కార్మికులతో కలిసి ఎస్ఈకి గురువారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా యాకుబ్ షావలి మాట్లాడుతూ.. టెండరుకాలం ముగిసినందున గత 28రోజులుగా కార్మికులకు ఉపాధి లేకుండా అయిందన్నారు. యాజమాన్యం వెంటనే జోక్యం చేసుకొని టెండరు వేసేవిధంగా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో వెంకటబాయ్, పద్మ, సుజాత, స్వరూప, సునీత తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !