UPDATES  

 మహిళలు బిసిల కోసం మహోద్యమం

  • మహిళలు బిసిల కోసం మహోద్యమం
  • భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా నిరసనలకు రేగా కాంతారావు పిలుపు
  • గులాబీదళపతి ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా కార్యక్రమాలు
  • ప్రగతిభవన్ లో సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావును కలిసిన రేగా కాంతారావు
  • పులుసుబొంత జీవో నేడో రేపో వచ్చే అవకాశం

మన్యంన్యూస్ ప్రతినిధి :

చ‌ట్ట‌స‌భ‌ల్లో బీసీలు, మ‌హిళల‌కు రిజ‌ర్వేష‌న్ల బిల్లులు ప్ర‌వేశ‌పెట్టాల‌ని బిఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. చ‌ట్ట‌స‌భ‌ల్లో బీసీల‌కు, మ‌హిళ‌ల‌కు 33 శాతం రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించాల‌ని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్ల‌మెంట‌రీ పార్టీ తీర్మానం చేయగా, ఇదే డిమాండ్ తో జిల్లాల్లో ఆందోళనలకు బిఆర్ఎస్ నాయకత్వం పిలుపునిచ్చింది. శనివారం భద్రాద్రి జిల్లాల్లోని ఐదు నియోజకవర్గాల్లో ర్యాలీలు, మీడియా సమావేశాలు నిర్వహించాలని బిఆర్ ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు పిలుపునిచ్చారు. ఈ రెండు బిల్లుల‌ను 18 నుంచి జ‌ర‌గ‌బోయే పార్ల‌మెంట్ ప్ర‌త్యేక స‌మావేశాల్లో ప్ర‌వేశ‌పెట్టాల‌ని డిమాండ్ చేసింది. శుక్రవారం ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న‌ సమావేశమైన బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సంయుక్త సమావేశం ఏకగ్రీవంగా తీర్మానిస్తూ, ముక్త కంఠంతో కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయగా, పార్టీ నాయకత్వం కూడా గల్లీ నుండి ఢిల్లీ దాకా కార్యక్రమాలు చేపట్టనుంది.

నేడో రేపో పులుసుబొంత జీవో

పులుసుబొంత ప్రాజెక్టు జీవో నేడో రేపో వచ్చే అవకాశముందని ప్రభుత్వవర్గాలు తెలిపాయి. శుక్రవారం ఆర్ధిక శాఖా మంత్రి హరీష్ రావును ఎమ్మెల్యే రేగా కాంతారావు కలిశారు. మరోవైపు నూతన వైద్యకళాశాలల ప్రారంభోత్సవం నేపథ్యంలో.. ప్రగతిభవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో జరిగిన ప్రారంభ కార్యక్రమంలో రేగా కాంతారావు పాల్గొన్నారు.
………

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !