మన్యం న్యూస్ ,వాజేడు:
మండల కేంద్రంలో హనుమాన్ సెంటర్లో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పెనుమల్ల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి శుక్రవారం పాలాభిషేకం నిర్వహించారు.మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ కృషితో మండలంలోని అంతర్గత సీ సీ రోడ్ల నిర్మాణం కోటి 50 లక్షలు రూపాయలు ఎస్ డి ఎఫ్ గ్రాంట్ మంజూరైనట్లు ఆయన తెలిపారు.మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణకి వాజేడు మండల బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల అధికార ప్రతినిధి చెన్నం ఎల్లయ్య ఎంపీటీసీ ఫోరం మండల అధ్యక్షులు గొంది రమణారావు పేరూరు ఎంపీటీసీ సభ్యులు గుడివాడ చంద్రశేఖర్ పిఎసిఎస్ డైరెక్టర్ పాయం శంకర్ దయాల్ వాజేడు మండల బి ఆర్ ఎస్ నాయకులు పెనుమల్లు వెంకటరెడ్డి తలడి వెంకటేశ్వర్లు తంగేళ్లపల్లి రామకృష్ణ చిరుమర్తి శ్రీనివాస్ సత్యనారాయణ సుగంధపు మల్లికార్జున్ పునెం శారద చెన్నం సర బాబు కొప్పనాతి నిరీక్షణ తదితరులు పాల్గొన్నారు.