మన్యం న్యూస్ , అశ్వాపురం:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు ఆదేశాల మేరకు బిఆర్ఎస్ పార్టీ మండల యువజన విభాగం నాయకులు, మోదుగు వంశీ పుట్టినరోజు వేడుకలు అశ్వాపురం మండల కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం శుక్రవారం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వంశీకి పలువురు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు .ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కోడి అమరేందర్, మండల సీనియర్ నాయకులు, సూదిరెడ్డి గోపిరెడ్డి, నియోజకవర్గ యువజన ఉపాధ్యక్షులు లంకెల రమేష్, మండల యువజన విభాగం అధ్యక్షులు గద్దల రామకృష్ణ, మండల ప్రచార కార్యదర్శి గడకారి రామకృష్ణ, మండల సహాయ కార్యదర్శి చుంచు రామ్మూర్తి, అశ్వాపురం గ్రామ శాఖ అధ్యక్షులు జూపల్లి కిరణ్, రాయపూడి అశోక్, మామిడాల శివయ్య, కాలవ సంసోన్, మేకల భాస్కర్, కరకపల్లి డేవిడ్, మడిపల్లి రమేష్ మండల నాయకులు యువజన నాయకులు తదితరులు పాల్గొన్నారు.