మన్యం న్యూస్ చర్ల: మండలం లోని పలు గ్రామాలలో సీ సీ రోడ్ల నిర్మాణం, వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు 2కోట్ల రూపాయలు ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ మంజూరు చేశారు.ఈ సందర్భంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, భద్రాచలం నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ తెల్లం వెంకట్రావు ఆదేశానుసారం చర్ల బిఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి పోలిన లంకరాజు ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో ముఖ్యమంత్రి కేసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు అయినవోలు పవన్, దొడ్డి సూరిబాబు, రైతు బంధు సమితి క్లస్టర్ తోటపల్లి మాధవరావు, యూత్ అధ్యక్షుడు కాకి అనిల్, గోమ్ముగూడెం సర్పంచ్ పోడియం మురళి, తుర్రం రవి, ఆలం ఈశ్వర్, వినోద్, దొడ్డి తాతారావు, ఎడ్ల రామదాసు, తోటమల్ల రవి, పాకాల సత్యనారాయణరాజు, గోరింట్ల వెంకటేశ్వరవు, మేడబత్తిని గోవర్ధన్, బోళ్ళ వినోద్, తడికల బుల్లేబ్బాయి, రావుల సతిష్, అంబోజి సతిష్, పార్టీ సోషల్ మీడియా ఇంచార్జీ పంజా రాజు పాల్గొన్నారు.