ప్రజలకు రక్షణ కల్పించడమే పోలీసుల బాధ్యత…
బయ్యారం సిఐ బాబురావు..
బయ్యారం, మన్యం న్యూస్ : ప్రజలకు భద్రతా భావన, రక్షణ కల్పించడమే పోలీసుల బాధ్యత అని బయ్యారం సీఐ బాబురావు అన్నారు. గురువారం ఆయన పోలీసుల బృందంతో జగ్నా తండాలో కమ్యూనిటీ కాంట్రాక్టు ప్రోగ్రాం నిర్వహించారు. దీనిలో భాగంగా అనుమతి పత్రాలు లేని బైక్ లను, గుడుంబా తయారు చేసే బెల్లాన్ని స్వాధీనం చేసుకున్నారు. ప్రజలకి ఏ సమస్య వచ్చిన, కొత్తవారు ఎవరైనా గ్రామంలో అనుమాన స్పదంగా మారిన తమకి తెలియజేయాలనీ అన్నారు. ఈ కార్యక్రమంలో బయ్యారం ఎస్ ఐ ఉపేందర్, గార్ల ఎస్ ఐ వెంకన్న మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.