బయ్యారం, మన్యం న్యూస్: వినాయక మండపాల దగ్గర ఎలాంటి అవంచనీయ సంఘటనలు జరగకుండా బాధ్యత నిర్వాహకులదే అని బయ్యారం మండల ఎస్ ఐ ఉపేందర్ అన్నారు. శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేసారు. బయ్యారం మండలంలో గణేష్ నవరాత్రుల సందర్భంగా ఉత్సవాలు నిర్వహించేవారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పర్యవేక్షించే బాధ్యత మండప నిర్వాహకులదే అని అన్నారు. అలాగే మండల లో గణపతి ఉత్సవాలు నిర్వహించే ఉత్సవ కమిటీ లు పోలీసు స్టేషన్ లో తప్పక అనుమతి తీసుకోవాలని సూచించారు.