మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
ఈనెల 19న మంత్రి కేటీఆర్ ద్వారా బిఆర్ఎస్ పార్టీలో తనతో పాటుగా 3 వేల మందితో చేరడం జరుగుతుందని కోనేరు సత్యనారాయణ(చిన్ని) తెలిపారు. శనివారం చిన్ని స్వగృహంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇక్కడ నుండి కార్లతో హైదరాబాదుకు బయలుదేరడం జరుగుతుందన్నారు. అక్కడ వివిధ పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు చేరనున్నట్లు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న వివిధ సంక్షేమ పథకాలకు అకర్షితులై అనేకమంది ఇంకా గులాబీ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. మూడోసారి కూడా కేసీఆర్ సీఎం కావడం ఖాయం అన్నారు. గులాబీ పార్టీ అభివృద్ధికి శక్తివంచన లేకుండా పనిచేస్తానని కోనేరు సత్యనారాయణ పేర్కొన్నారు. ఈ విలేకరుల సమావేశంలో కోనేరు సత్యనారాయణ అనుచరులు పాల్గొన్నారు.