మన్యం న్యూస్,మణుగూరు:
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు, పినపాక నియోజకవర్గం శాసనసభ్యులు ఎమ్మెల్యే రేగా కాంతరావు ఆదేశాల మేరకు మణుగూరు మున్సిపాలిటీ పరిధిలోని పికే 1 సెంటర్ విఠల్ రావు నగర్ కు చెందిన పులి దుర్గ ప్రసాద్ (28)గత కొద్ది రోజుల క్రితం బలవన్మరణం చేసుకోవడం జరిగినది.మృతునికి భార్య ,ఇద్దరు పిల్లలు ఉన్నారు,వారిది నిరుపేద కుటుంబానికి చెందగా,వారి ఆర్థిక పరిస్థితి తెలుసుకున్న వెంటనే ,బీ ఆర్ ఎస్ పార్టీ నియోజకవర్గ యువజన విభాగం కోఆర్డినేటర్ బుద్దరాజు నవీన్ బాబు రేగ మిష్ణు మెమోరియల్ ట్రస్టు ఆధ్వర్యంలో 50 కిలోల బియ్యం ,రూ. 5వేల నగదు వితరణ గా అందజేశారు. ఈ కార్యక్రమంలో బీ ఆర్ ఎస్ పార్టీ నాయకులు,వల్లభనేని రమణ,రఘు,ఉమ,రాజీవ్, సూర్యం,సత్తిబాబు, శ్రీకాంత్, సాయి,రేగ సోషల్ మీడియా వారియర్స్ గుంటక ప్రవీణ్, డేగల సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
