మన్యం న్యూస్,ఇల్లందు:పర్యావరణానికి హాని కలిగించే రంగులు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారీస్ తో చేసిన విగ్రహాలకు బదులుగా మట్టి విగ్రహాలతో గణేషుడి పండుగ జరుపుకోవాలని 19వ వార్డు కౌన్సిలర్ పత్తి స్వప్న అన్నారు. 19వ వార్డులో మెప్మా ఆధ్వర్యంలో ఇంటింటికి గణేషుడి మట్టివిగ్రహాలను శనివారం సాయంత్రం వార్డు ప్రజలకు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్పీ గంగ, నాగమణి, ముత్యాల రాజకుమారి, గురువమ్మ, రమాదేవి, షరీఫాబేగం తదితరులు పాల్గొన్నారు.
