మన్యం న్యూస్ , అశ్వాపురం:అశ్వాపురం మండల కేంద్రంలో గల వృద్ధాశ్రయంలో నిరాదరణకు గురై ఆకలితో అలమటిస్తూ బొంబాయి కాలనీ బస్ షెల్టర్ వద్ద నిస్సహాయ స్థితిలో పడిఉన్న కొమరం కిరణ్ అనే వ్యక్తిని అశ్వాపురం ఆరిఫా అండ్ రోష్ని వృద్ధాశ్రమంలో చేర్పించినట్లు ఐ ఎఫ్ టి యు ఏరియా అధ్యక్షులు ఏ మంగీలాల్ విలేకరులకు తెలిపారు.గత వారం రోజులుగా బొంబాయి కాలనీ బస్సు సెంటర్ వద్ద ఒక వ్యక్తి ఆకలితో అలమట్టిస్తున్నాడని అనాధలా ఉన్నాడని కాలనీవాసులు తమ నాయకులు నాసర్ పాషా కి సమాచారం ఇవ్వటంతో తాము స్పందించి సింగరేణి సేవా సమితి సభ్యులు ఎస్ కుమారస్వామి ఎస్ గట్టయ్య ల సహకారంతో అతని వెంటనే ఆటోలో వృద్ధాశ్రమంలో చేర్పించినట్లు ఆయన తెలిపారు.ఆ వ్యక్తిని వివరాలు కోరగా ఆ వ్యక్తి కథనం ప్రకారం పేరు కొమరం కిరణ్ భార్య సీత ఇద్దరు పిల్లలు ఊరు బయ్యారం సినిమా హాల్ సెంటర్ తనకు రేచీకటనీ పగలు కూడా చూపు సరిగా ఉండటం లేదని పొలంలో పత్తిచేలో పురుగుల మందు కొడుతుండగా ఆ సమస్య తలెత్తిందనీ చెప్తున్నాడన్నారు. పవర్ ప్లాంట్ విషయంలో భూ నిర్వాసితుడ్ని అని నమ్మిన వాళ్లు డబ్బులు కాజేసి తనను పట్టించుకోవడం లేదని ఆ వ్యక్తి వాపోతున్నాడని తెలిపారు. అడిగిన వెంటనే ఆ వ్యక్తికి వృద్ధాశ్రమంలో ఆశ్రయానికి అనుమతి ఇచ్చిన వృద్ధాశ్రమం నిర్వాహకురాలు షేక్ షహనాజ్ తోడ్పాటు అందించిన భరోసా వెల్ఫేర్ సొసైటీ సభ్యులు ఎండి అమీన్ కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సింగరేణి రైల్వే కాంట్రాక్ట్ కార్మికులు శివరామకృష్ణ,భద్రయ్య,అజామత్తుల్ ,యాదమ్మ తదితరులు పాల్గొన్నారు.
