పిల్లలతో బలవంతపు వెట్టి చాకిరి చేయించడం నేరం
* జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి
జి.భానుమతి
మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
మానవ అక్రమ రవాణ చట్టరీత్య నేరమని, పేదరికము ఆర్థిక అవసరాల కోసం ఉపాధి కల్పిస్తామని మహిళలను పిల్లలను బలవంతపు వెట్టి చాకిరి, లైంగిక దోపిడీ, బానిసత్వం వాటిలోకి దింపి వారి చేత చట్ట వ్యతిరేక కార్యకలాపాలను చేయిస్తున్నారని అలాంటివారికి చట్టపరంగా కట్టిన శిక్షలు ఉంటాయని న్యాయమూర్తి తెలిపారు. శనివారం పాల్వంచ లో ఉన్న బాలుర తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ లో జరిగిన న్యాయ అవగాహన కార్యక్రమంలో న్యాయమూర్తి పాల్గొని ప్రసంగించారు. విద్యార్థులు సత్ప్రవర్తనతో మంచి విద్యావిధానాన్ని అలవర్చుకోవాలని తెలిపారు. ఉన్నత లక్ష్యాలు ఏర్పరచుకొని అత్యున్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం బార్ అసోసియేషన్ జాయింట్ సెక్రెటరీ కాసాని రమేష్, డిప్యూటీ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ పి.నిరంజన్ రావు, అనుబ్రోలు రాంప్రసాదరావు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ మెంబర్ అంబేద్కర్, అసిస్టెంట్ కౌన్సిల్స్ జ్యోతి విశ్వ కర్మ, నాగ స్రవంతి, కళాశాల ప్రిన్సిపల్, అధ్యాపకులు, న్యాయవాది మెండు రాజమల్లు పాల్గొన్నారు.