మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో పాల్వంచ కాంట్రాక్టర్స్ కాలనీలో ప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసం ఉన్న ఆగాపే సెంటర్ లో శనివారం ప్రత్యేక వైద్య శిబిరంను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగ పాల్గొన్న జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జి.భానుమతి మాట్లాడుతూ వైకల్యం అనేది ఒక ఘటన మాత్రమే కానీ సమస్య కాదు అనే విషయం పట్ల సమాజాన్ని చైతన్య పరచవలసిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. లక్ష్యాన్ని సాధించడంలో ఉన్నత శిఖరాలను అధిరోహించడంలో వైకల్యం అడ్డురాదని తెలిపారు. దివ్యాంగులకు ప్రత్యేక చట్టం ఉందని అందులో వారికి ఉండాల్సిన హక్కులను పొందుపరిచారని తెలిపారు. అనంతరం వినికిడి పరికరంను డిస్టిక్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సహాయంతో న్యాయమూర్తి పిల్లలకు ఇచ్చారు. కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రి నుండి ఇఎన్టీ స్పెషలిస్ట్ డాక్టర్ మహమ్మద్ పాషా, పీడియాట్రిషన్ మనోహర్, జనరల్ మెడిసిన్ సంతోష్, స్టాఫ్ నర్స్ పిల్లలకు వైద్య సదుపాయంను అందించారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రమేష్ కుమార్ మక్కడ్, జాయింట్ సెక్రెటరీ కాసాని రమేష్, డిప్యూటీ లీగల్ ఎయిడ్ పి. నిరంజన్ రావు, సీనియర్ న్యాయవాది అనుబ్రోలు రాంప్రసాదరావు, తోట మల్లేశ్వరరావు, మెండు రాజమల్లు, అసిస్టెంట్ కౌన్సిల్స్ జి.నాగ స్రవంతి, జ్యోతి విశ్వకర్మ, అగాపే సెంటర్ నిర్వాహకురాలు క్రిసోలైట్, లైన్స్ క్లబ్ మెంబర్స్, పి. ఎల్.వి రాజమణి, అనురాధ తదితరులు పాల్గొన్నారు.