UPDATES  

 రిజర్వేషన్ల బిల్లులు ప్రవేశపెట్టాల్సిందే: ఎమ్మెల్యే వనమా * కొత్తగూడెంలో భారీ ర్యాలీతో గులాబీమయం

మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
బిసిలకు రిజర్వేషన్.. మహిళా రిజర్వేషన్ బిల్లును వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో శనివారం భద్రాద్రి జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరిగింది. బిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు శ్రేణులు ర్యాలీగా వెళ్లి అంబేద్కర్ సెంటర్లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే వనమా మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం బిసి రిజర్వేషన్ మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టి కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తన చిత్తశుద్ధిని చాటుకోవాలన్నారు. రిజర్వేషన్ పట్ల బిఆర్ఎస్ పార్టీ పూర్తిగా కట్టుబడి ఉందని వెంటనే పార్లమెంటులో ప్రవేశపెట్టాలని డిమాండు చేస్తున్నామన్నారు. గతంలో బిసిల రిజర్వేషన్ మహిళా రిజర్వేషన్ విషయమై 9 సంవత్సరాల కాలం తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగిందన్నారు. ఇన్ని సంవత్సరాలైనా కేంద్రం ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదో అర్ధం కావడం లేదన్నారు. కేంద్రంలో బిల్లు ప్రవేశపెడితే బిఆర్ఎస్ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ అఖండ విజయం సాదించి ముఖమంత్రిగా సిఎం కేసిఆర్ హాట్రిక్ సాదించడం ఖాయమన్నారు.
ఏ రాష్ట్రాలలో అమలు చేయని అనేక పథకాలు బిఆర్ఎస్ ప్రభుత్వం చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వనమా రాఘవేందర్, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖరరావు, డిసిఎంఎస్ వైస్ చైర్మన్ కోత్వాల శ్రీనివాసరావు, గ్రంధాలయ చైర్మన్ దిండిగల రాజేందర్, మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి, ఎంపిపిలు భదవత్ శాంతి, భూక్యా సోనా, భూక్యా విజయలక్ష్మి, ఆత్మ కమిటీ చైర్మన్ బత్తుల వీరయ్య, సొసైటీ చైర్మన్ మాడే హనుమంతరావు, మార్కెట్ కమిటీ చైర్మన్ భూక్యా రాంబాబు, ఉర్దూ ఘర్ కమిటీ చైర్మన్ అన్వర్ పాషా తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !