UPDATES  

 నినాదాల హోరు దద్దరిల్లిన కలెక్టరేట్

నినాదాల హోరు దద్దరిల్లిన కలెక్టరేట్
* మహిళలు కన్నెరతో కలెక్టరేట్ ముట్టడి వద్ద ఉద్రిక్తత
* కార్యాలయంలోకి ప్రవేశించేందుకు యత్నం అడ్డుకున్న పోలీసులు
* పోలీసులతో తీవ్ర వాగ్వివాదం తోపులాట
* ఏఐటియుసి, సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా

మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
గత కొద్ది రోజులుగా సమస్యలు పరిష్కరించాలని అంగన్వాడీలు కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమాలు చేస్తున్న విషయం తెలిసిందే. ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేకపోవడంతో అంగన్వాడీలు కన్నెర చేసి కలెక్టరేట్ ముట్టడికి దిగి పెద్ద ఎత్తున ఆందోళన నినాదాలతో కలెక్టరేట్ దద్దరిల్లింది.
పనిభద్రత కనీస వేతనాల అమలు చట్టపరమైన హక్కుల అమలుకోసం ఏఐటీయూసీ సీఐటీయూ ఆధ్వర్యంలో శనివారం చేపట్టిన కలెక్టరేట్ ముట్టడి ఉద్రిక్తంగా మారింది. డిమాండ్ల పరిస్కారంకోసం అంగన్వాడీ సిబ్బంది సమ్మె చేస్తుంటే వారు నిర్వహించే కేంద్రాలపై ప్రభుత్వ అధికారులు దాడులు చేసి కేంద్రాలను స్వాధీనం చేసుకుంటుండటంతో సహనం కోల్పోయిన సిబ్బంది ఆగ్రాహానికి గురయ్యారు. ధర్నా చేస్తున్న క్రమంలో ఒక్కసారిగా కలెక్టరేట్ కార్యాలయం ప్రధాన ద్వారం ఎక్కి కార్యాలయంలోకి ప్రవేశించేందుకు ప్రయ్నతించడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య తోపులాట, వాగ్వివాదం చోటు చేసుకోవడంతో కలెక్టరేట్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సందర్బంగా సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె.సాబీర్ పాషా, సిపిఎం జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య మాట్లాడుతూ అంగన్వాడీ సిబ్బంది సమ్మె చేస్తుంటే అంగన్వాడీ కేంద్రాలపై దాడులకు ఉసిగొల్పడం రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశ పాలనకు నిదర్శనమని ప్రభుత్వం తన తీరు మార్చుకోకుంటే కేంద్రాలను కాపాడుకునేందుకు హక్కులను సాధించుకునేందుకు ప్రతిఘటన ఉద్యమాలు నిర్వహించడం అనివార్యమవుతుందని అన్నారు. ఏండ్ల తరబడి ప్రభుత్వానికి ప్రజలకు సేవలందిస్తున్న అంగన్వాడీ సిబ్బంది పట్ల ప్రభుత్వం వివక్షత ప్రదర్శిస్తోందని కేవలం ప్రభుత్వ పథకాలు ప్రచారానికి సిబ్బందిని వినియోగించుకుంటూ వారి సంక్షేమాన్ని గాలికొదిలేసిందన్నారు. స్వరాష్ట్ర పాలనలో కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ స్కీమ్ వర్కర్లకు ఉద్యోగ భద్రత కరువవుతోందని కనీస వేతనాలను సైతం నోచుకోని పరిస్థితి ఏర్పడిందన్నారు. సమస్యల పరిష్కారంకోసం కనీస వేతనాల అమలుకోసం అంగన్వాడీలు ఎన్ని ఆందోళనలు నిర్వహించినప్పటికి పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. కనీస వేతనం రూ.26వేలు, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు పెండింగ్ వేతనాలు బిల్లులు పదవి విరమణ బెనిఫిట్లకోసం తమ పదవీకాలమంతా పోరాడాల్సిన దుస్థితికి ప్రభుత్వం తీసుకొచ్చిందని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వ స్పందించి సమస్యలు పరిష్కరించాలని లేనిపక్షంలో దశలవారీగా పోరాటాలు తప్పవని హెచ్చరించారు. అనంతరం అసోషియేషన్ల నాయకులు జిల్లా కలెక్టర్ను కలిసి డిమాండ్ల వినతిపత్రం సమర్పించారు. వెంకటమ్మ, గోనె మణి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఏఐటియుసి, సిఐటియు జిల్లా నాయకులు ఏజె.రమేష్, నరాటి ప్రసాద్, అంగన్వాడీ అసోషియేషన్ల నాయకులు సిహెచ్.సీతామహాలక్ష్మి, రెడ్డి అరుణ, జయలక్ష్మి, గౌని నాగేశ్వర్రావు, భూక్య లలిత, పాయం శ్రీలత, ఇందిర, నర్సమ్మ, మమత, విజయశీల, వీరభద్రమ్మ, వెంకటరమణ, పద్మ, జ్యోతి, రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !