మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
కాంగ్రెస్ విజయభేరి విజయవంతం చేసేందుకు ఆదివారం హైదరాబాద్ కు ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శ్రేణులు భారీగా తరలి వెళ్లడం జరిగింది. ఉమ్మడి ఖమ్మంజిల్లా వ్యాప్తంగా సుమారు 1254 కార్లలో తరలి వెళ్లారు. కార్లన్ని ఖమ్మంలోని ఎస్ఆర్ గార్డెన్స్ కు చేరుకోగా తదనంతరం ఆ కార్లన్ని ర్యాలీగా బయలుదేరి విజయభేరి సభ ప్రాంగణానికి చేరుకున్నాయి. భారీ జెండాలు, ప్లెక్సీలు, కార్లకు స్టిక్కర్లతో ప్రదర్శనగా పోవడం జరిగింది. పాలేరు నుంచి 180, ఖమ్మం నుంచి 240, వైరా నుంచి 115, సత్తుపల్లి నుంచి 150, మధిర నుంచి 105, ఇల్లందు నుంచి 145, కొత్తగూడెం నుంచి 105, అశ్వారావుపేట నుంచి 109, భద్రాచలం నుంచి 30, పినపాక నుంచి 75 కార్లతో విజయభేరికి పొంగులేటి శ్రేణులు వెళ్లినట్లు పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇంఛార్జీ తుంబూరు దయాకర్ రెడ్డి తెలిపారు.