బూర్గంపహాడ్ మండల ప్రజలకు బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు.వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను మండల ప్రజలు భక్తి శ్రద్ధలతో ఆనందోత్సాహాలతో ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని తెలిపారు.ప్రజలకు ఎలాంటి విజ్ఞాలు కలగకుండా సుఖశాంతులతో,ఆయురారోగ్యాలతో కలకాలం వర్ధిల్లాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు.వాతావరణ కాలుష్యాన్ని నివారించేందుకు అందరూ మట్టితో తయారుచేసిన ప్రతిమలను వినియోగించాలని విజ్ఞప్తి చేశారు.