మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా ఆదివారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో డాక్టర్ వినీత్.జి జాతీయ జెండాను ఆవిష్కరించి అధికారులకు, సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నిజాం పాలన నుండి తెలంగాణ విముక్తి కోసం పాటుపడిన వీరుల ప్రాణత్యాగాల ఫలితమే భారతదేశంలో తెలంగాణ కూడా అంతర్భాగమై ఈ రోజు మనమంతా అభివృద్ధి బాటలో కొనసాగుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ అడిషనల్ ఎస్పీ విజయ్ బాబు,డీసీఆర్బీ డిఎస్పీ మల్లయ్యస్వామి,ఏవో జయరాజు మరియు ఇతర పోలీసు అధికారులు,సిబ్బంది పాల్గొన్నారు.