మన్యం న్యూస్ బూర్గంపహాడ్: మణుగూరులో శనివారం ఓ పార్టీ కార్యకర్త జర్నలిస్టుపై చేసిన దాడిని ఖండిస్తూ బూర్గంపహాడ్ మండల పరిధిలోని సారపాక ప్రధాన రహదారి పై జర్నలిస్టులు ర్యాలీ నిర్వహించారు.తొలుత జాతిపిత గాంధీకి పూలమాల వేసి నివాళులర్పించి అక్కడి నుండి ర్యాలీ చేపట్టారు.ప్రజలకు ప్రభుత్వాలకు మధ్య వారిదిగా నిలుస్తున్న జర్నలిస్టులపై దాడిని ఖండిస్తూ నల్లటి రిబ్బన్లు ధరించి నిరసన వ్యక్తం చేశారు.జర్నలిస్టు దాడిని తీవ్రంగా ఖండిస్తూ జర్నలిస్టు చేస్తున్నటువంటి నిరసన ర్యాలీకి స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్,బిఎస్పి,బిజెపి,సిపిఐ,తెలుగుదేశం పార్టీ నాయకులు పలువురు జర్నలిస్టులకు సంఘీభావం తెలిపారు.తెలంగాణ రాష్ట్రం సాధనలో ప్రధాన పాత్ర పోషించినటువంటి జర్నలిస్టులపై ఆ పార్టీ నేత దాడిని తీవ్రంగా తప్పుపట్టారు.రాజ్యాలు అధికారంకు రావాలన్న నేతలు పదవులు చేపట్టాలన్న ప్రజలకు సమాచారాన్ని అందించేవారిదిగా నిలబడే జర్నలిస్టులు ప్రధానమని అటువంటి వారిపై దాడులు చేయటం హేయకరమైనటువంటి విషయమని దాడులను ఖండిస్తూ నిరసన వ్యక్తం చేశారు.మరోసారి ఇటువంటి సంఘటనలు పునరావతం కాకుండా రాజకీయ పార్టీలు మెలగాలని జర్నలిస్టులకు సంఘీభావం తెలిపిన పలువురు నేతలకు జర్నలిస్టులు ధన్యవాదాలు తెలియజేశారు.