మన్యం న్యూస్ చర్ల:
గిరిజన విద్యార్థిని విద్యార్థుల భవిష్యత్ మార్గదర్శకాలకై అవగాహన కార్యక్రమం చర్ల మండలం పెద్ద మిడిసిలేరు గిరిజన సంక్షేమ శాఖ బాలికల పాఠశాల ఆవరణలో ఆదివారం నిర్వహించినట్లు ప్రధానోపాధ్యాయురాలు చంద్రకళ తెలిపారు. పాఠశాల ఆవరణలో నిర్మాణ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో జిల్లాలో కెరియర్ గైడెన్స్ పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అనంతరం చంద్రకళ మాట్లాడుతూ వెరీజాన్ కంపెనీ నిర్మాణ సంస్థకు అందించిన వాహనం ద్వారా ఐటీడీఏ పరిధిలోని గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలలో వసతి గృహాలలో ఈనెల 14వ తేదీ నుండి 18 వ తేదీ వరకు 9వ తరగతి నుండి డిగ్రీ వరకు విద్య అభ్యసిస్తున్న విద్యార్థులకు భవిష్యత్ మార్గదర్శక లపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించడం లో భాగంగా పాఠశాలలో ఈ కార్యక్రమం ఏర్పాటుచేయడం జరిగిందని అన్నారు. పవర్ ప్రజెంటేషన్ ద్వారా చూపించిన చిత్రాలను ఉపాధ్యాయులు హాస్టల్ వార్డెన్లు దీనికి సంబంధించిన అంశాలను విద్యార్థిని విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో ఈ పవర్ ప్రజెంటేషన్ ద్వారా విద్యార్థినిలు అవగాహన చేసుకొని చదువుపై మక్కువ పెంచుకోవాలని, సంబంధిత ఉపాధ్యాయులు చూపిన చిత్రాలను మరల పిల్లలకు తెలియజేయాలని, ఇట్టి సదవకాశాన్ని విద్యార్థిని విద్యార్థులు సద్వినియోగం కావాలని ఆమె అన్నారు. అనంతరం కెరియర్ గడియన్స్ సంబంధించిన అభ్యాసికాలు, పుస్తకాలు విద్యార్థినిలకు అందించారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ వార్డెన్ అనురాధ, నిర్మాణ ఆర్గనైజేషన్ సీనియర్ కౌన్సిలర్ కళింగ, జూనియర్ కౌన్సిలర్ సాయిబాబా, పైలట్ ఉదయ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.