అసాధ్యాన్నైనా సుసాధ్యం చేసేది విద్యార్థులే.
బ్రిలియంట్ కాలేజ్ నందు విద్యార్థులకు వ్యక్తిత్వ వికాస క్లాసులు.
చెట్లకు పూలు,విద్యార్థులకు వినయ విధేయతలు అందం.
మన్యం న్యూస్ బూర్గంపహాడ్:- బూర్గంపహాడ్ మండల పరిధిలోని సారపాక ప్రధాన పట్టణంలో గల బ్రిలియంట్ కాలేజ్ నందు విద్యార్థులకు వ్యక్తిత్వ వికాస ‘ప్రేరణ’ క్లాసులను ప్రముఖ సాహితీవేత్త వ్యక్తిత్వ వికాస నిపుణులు పరిటాల విష్ణుమూర్తి ఇవ్వటం జరిగింది.నేటి పోటీ ప్రపంచంలో విద్యార్థులు తాము ఎంచుకున్న లక్ష్యాలను ఏ విధంగా సాధించాలి అనే అంశాలపై మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ క్రమశిక్షణ కలిగి ఉన్నప్పుడే మీలో ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవచ్చు అన్నారు.అనంతరం బ్రిలియంట్ విద్యాసంస్థల అధినేత బిఎన్ ఆర్ పరిటాల విష్ణుమూర్తిని శాలువా కప్పి పుష్ప గుచ్చం,మెమొంటో తో సత్కరించారు.ఈ సందర్భంగా బిఎన్ ఆర్ మాట్లాడుతూ విద్యార్థులు తాను అనుకున్న లక్ష్యాల ని సాధించే క్రమంలో కొన్ని లోటుపాట్లు ఉంటాయని,అలాంటి సందర్భంలోనే మానసిక స్థైర్యాన్ని కోల్పోకుండా ముందుకు వెళితే ఎలాంటి అసాధ్యాన్నైనా సుసాధ్యం చేయవచ్చు అని తెలియజేశారు ప్రతి విద్యార్థి ప్రత్యేకమైన దృష్టిని సారిస్తే అవలీలగా మీరు అనుకున్న లక్ష్యాలను చేరుకోవచ్చు అన్నారు మన బ్రిలియంట్ కాలేజీలో ఎంతో నిరుపేద విద్యార్థు లైన సౌమ్య జేఎన్టియూ లో సీటు సాధించింది శ్రీ వల్లిక మెడిసిన్లో సీట్ సాధించిందని,మరికొందరు హైదరాబాద్ లయోలా లో సీట్లు సాధించి మన విద్యార్థులు వారి సత్తాను చాటుకున్నారని,మొన్న ప్రకటించిన ఎస్సై ఫలితాలలో మన బ్రిలియంట్ విద్యార్థి పల్లి భాగ్య శ్రీ ఎస్ఐ గా ఎంపికై నదని,ఈ సందర్భంగా అభినందనలు తెలియజేశారు బ్రిలియంట్ విద్యార్థులు అంటేనే ఒక ప్రత్యేకత అని వారు అన్ని రంగాల్లో ముందున్నారని తెలియజేస్తూ మీరు కూడా మీ సీనియర్స్ ని స్ఫూర్తిగా తీసుకొని మీరు అనుకున్నటువంటి లక్ష్యాలను చేరుకోవాలని మీ తల్లిదండ్రులకు మంచి పేరు ప్రతిష్టలు తేవాలని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో బ్రిలియంట్ విద్యాసంస్థలచైర్మన్ బి.ఎన్.ఆర్ అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు.