మన్యం న్యూస్ , పినపాక:
విశ్వకర్మ జయంతి ఉత్సవాలను స్వర్ణకార సంఘం,విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం పినపాక మండలం దుగినేపల్లి లో ఘనంగా నిర్వహించారు. సంఘం మండల అధ్యక్షులు సింహాద్రి పోతురాజు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.సంఘ పెద్దల విశ్వకర్మ జెండా ఆవిష్కరించారు. దుగినేపల్లి గ్రామంలోని శివాలయం లో విశ్వకర్మ యజ్ఞ మహోత్సవ వేడుకలు 11 మంది దంపతులు పీఠం మీద కూర్చొని విశ్వకర్మ యజ్ఞ పూజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు పాల్గొన్నారు.