UPDATES  

 పల్లె ప్రకృతి వనాన్ని సందర్శించిన ఎమ్మెల్యే రేగా కాంతారావు.

 

మన్యం న్యూస్ బూర్గంపహాడ్:-భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండల పరిధిలోని సారపాక గ్రామపంచాయతీ కి చెందిన పల్లె ప్రకృతి వనాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక శాసనసభ్యులు,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు సందర్శించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణాలు పరిశుభ్రత పచ్చదనం పెరిగింది,పల్లెలు పట్టణాల అభివృద్ధి చెందుతున్నాయని,పునర్జీవన చర్యలో భాగంగా అడవులలో విస్తృతంగా మొక్కలు నాటడంతో పాటు రక్షణ చర్యలు తీసుకోవడం వల్ల దట్టమైన అడవులు ఏర్పడుతున్నాయి అని భారతదేశంలో ఎక్కడ కుడా మన రాష్ట్రంలో ఉన్న నర్సరీలు లేవు అని మొక్కలు నాటడం వల్ల పల్లె ప్రకృతి వానాలు గ్రామీణ ప్రజానీకానికి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించడం కోసం రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాలలో పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన అన్నారు,ప్రతి గ్రామపంచాయతీలలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి వనంలో మొక్కలు నాటడం వల్ల ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు గ్రామంలో ఉన్న పిల్లలకు అందరికీ సౌకర్యంగా ఉంటుందని అన్నారు.పల్లె ప్రకృతివనం ఉండటం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయని అన్నారు,ఈ కార్యక్రమంలో మణుగూరు జడ్పిటిసి పోశం నర్సింహారావు,బిఆర్ఎస్ పార్టీ నాయకులు పూజారి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !