అన్ని వర్గాల అభివృద్ధి ప్రభుత్వం ధ్యేయం..
డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పరిశీలించిన ప్రభుత్వ విప్ రేగ కాంతారావు ,ఎమ్మెల్యే అభ్యర్థి తెల్లం వెంకట్ రావు..
మన్యం న్యూస్ దుమ్ముగూడెం/భద్రాచలం, సెప్టెంబర్ 16::
తెలంగాణ ప్రభుత్వం అన్ని వర్గాల అభివృద్ధి సంక్షేమ పథకాలు అందిస్తుందని తెలంగాణ ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు రేగ కాంతారావు అన్నారు. ఆదివారం భద్రాచలం పట్టణంలో పర్యటించిన ఆయన నిర్మాణం పూర్తి చేసుకున్నటువంటి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమ పథకాల్లో దేశంలో తెలంగాణ నెంబర్ వన్ గా నిలుస్తుందని, అర్హులైన ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను అందిస్తామని ఇండ్లు లేని పేదలకు ప్రభుత్వం ఇల్లు అందిస్తుంది అని, ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలని మంచి ఆలోచనతో కేసీఆర్ గృహలక్ష్మి పథకం ప్రారంభించారని అన్నారు. నిర్మాణం పూర్తి చేసుకున్నటువంటి ఇండ్లను లబ్ధిదారులు త్వరలో అందిస్తామని తెలియజేశారు. భద్రాచలం నియోజవర్గ అభివృద్ధికి సీఎం కేసీఆర్ కట్టుబడి ఉన్నారని రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలే భద్రాచలం నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ తెల్లం వెంకట్రావు గెలుపు కృషి చేస్తాయని అన్నారు.ప్రజలు ఆయన ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట భద్రాచలం బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి తెల్లం వెంకటరావు, ఆర్డీవో మంగీలాల్, మండల అధ్యక్షులు తిరుపతిరావు, నాయకులు నక్క ప్రసాద్, ఎండి నవాబ్, లోకేష్ ,తదితరులు పాల్గొన్నారు.