మన్యం న్యూస్, అశ్వాపురం:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు ఆదేశాల మేరకు, అశ్వాపురం బిఆర్ఎస్ మండల పార్టీ నాయకుల సూచన మేరకు మిట్ట గూడెం గ్రామపంచాయతీకి చెందిన పినపాక నియోజకవర్గ యువజన విభాగం అధికార ప్రతినిధి మామిళ్ళ రాము ప్రమాదవశాత్తు క్రిందపడటంతో చేతికి గాయం అవడం జరిగింది.విషయం తెలుసుకున్న అశ్వాపురం బిఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు గద్దల రామకృష్ణ వారి నివాసం వద్దకు వెళ్లి మామిళ్ళ రాముని పరామర్శించడం జరిగింది.ఈ కార్యక్రమంలో అశ్వాపురం గ్రామ శాఖ అధ్యక్షులు జూపల్లి కిరణ్,రాయపూడి అశోక్, మేకల భాస్కర్, రావుల అజయ్, కన్నెబోయిన వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.