మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య
మన్యం న్యూస్,ఇల్లందు:సెప్టెంబర్ 17 ముమ్మాటికీ తెలంగాణ విద్రోహ దినమే అని సీపీఐ ఎంఎల్ ప్రజాపంథా రాష్ట్రనాయకులు, ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య అన్నారు. సిపిఐ ఎంఎల్ ప్రజాపంథా ఇల్లందు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ముఖ్యకార్యకర్తల సమావేశం ఆదివారం జరిగింది. ఈ సమావేశంలో గుమ్మడి నరసయ్య పాల్గొని నిజాం మూడురోజులలో లొంగిపోయి ఒప్పందం చేసుకుని నజరానాలు, రాజ్ ప్రముఖ బిరుదు అందుకున్నాడన్నారు. పటేల్ సైన్యం తెలంగాణాలో కమ్యూనిస్టులను వేటాడిందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు బుర్ర వెంకన్న, పట్టణ కార్యదర్శి షేక్ యాకుబ్ షావలి, నాయకులు పిల్లి మల్లేష్, వీరన్న, పిడిఎస్యు జిల్లా కార్యదర్శి కాంపాటి పృథ్వి, శ్రీశ్రీ, గణేష్, పార్ధు, తరుణ్, సాయి తదితరులు పాల్గొన్నారు.