మన్యం న్యూస్ చర్ల:
చర్ల మండల బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవం పురస్కరించుకొని మండల అధ్యక్షులు సోయం రాజారావు జాతీయ జెండాను ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధికార ప్రతినిధి ఇరస వడ్ల రాము, సర్పంచ్ కాపుల కృష్ణార్జున రావు, ప్రచార కమిటీ కార్యదర్శి కోటేరు శ్రీనివాస్ రెడ్డి, ఉపాధ్యక్షులు ఐనవోలు పవన్, బిసి సెల్ అధ్యక్షుడు దొడ్డి సూరిబాబు, రైతు బంధు సమితి క్లస్టర్ తోటపల్లి మాధవరావు, యూత్ అధ్యక్ష కార్యదర్శులు కాకి అనిల్, నేర్రబోయిన చంద్రశేఖర్, శ్యామల శివ,పాకలపాటి సత్యనారాయణరాజు, మెంతుల నాగరాజు, అంబోజి సతిష్, పంజా రాజు తదితరులు పాల్గొనడం జరిగింది.