మన్యం న్యూస్ దుమ్ముగూడెం/ భద్రాచలం సెప్టెంబర్ 16::
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అరెస్టును ఖండిస్తూ తెలుగుదేశం పార్టీ భద్రాచలం కమిటీ ఆధ్వర్యంలో పట్టణంలోని అంబేద్కర్ సెంటర్ వద్ద నిర్వహిస్తున్న నిరసన దీక్షకు సిపిఐఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, భద్రాచలం బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి తెల్లం వెంకటరావు సంఘీభావం తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజకీయాలలో వ్యక్తిగత కక్షలు మంచివికావని అభిప్రాయపడ్డారు.
అనంతరం తెలుగుదేశం పార్టీ చేస్తున్న దీక్షను భద్రాచలం చెందిన పలువురు ప్రముఖులు సందర్శించి వారికి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపచేశారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతిరెడ్డి సుదర్శన్ రావు ,జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య , బిఆర్ఎస్ నాయకులు ఎండి నవాబ్,నక్క ప్రసాద్ ,లోకేష్, కాంగ్రెస్ నాయకులు రవికుమార్, నరేష్, బోగల శ్రీనివాస్ రెడ్డి, పట్టణ ప్రముఖులు పాకల దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.