UPDATES  

 బీఎంఎస్ ఆధ్వర్యంలో ఘనంగా జాతీయ కార్మిక దినోత్సవం

 

మన్యం న్యూస్,ఇల్లందు:సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్-బీఎంఎస్ ఆధ్వర్యంలో జాతీయ కార్మిక దినోత్సవం, తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జేకే ఓసీలో బీఎంఎస్ ఇల్లందు బ్రాంచి ఉపాధ్యక్షులు నాయని సైదులు అధ్యక్షతన ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశంలో జేబీసీసీఐ సభ్యులు మాధవనాయక్, నాయని సైదులు మాట్లాడుతూ..భగవాన్ విశ్వకర్మ భారతదేశంలోని కార్మికులకు ఆదర్శవంతంగా అనేక వ్యవసాయ పనిముట్లను, భవన నిర్మాణాల పనిముట్లతో పాటు మెళుకువలను మానవజాతికి అందించారని తెలిపారు. కార్మికులకు ఆదర్శవంతమైనటువంటి నిర్మాణాలను చేసినందుకుగాను సెప్టెంబర్ 17న భగవాన్ విశ్వకర్మ జయంతిని కార్మికసంఘం బిఎంఎస్ దేశవ్యాప్తంగా కార్మిక దినోత్సవంగా ఘనంగా నిర్వహించుకుంటుందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఎంఎస్ ఆర్గనైజింగ్ సెక్రటరీ రాజశేఖర్, పిట్ సెక్రటరీ ప్రదీప్, పిట్ కార్యదర్శి ప్రవీణ్, సింగరేణి, ఓబీ కాంట్రాక్టు కార్మికుల అధ్యక్షులు రాము, వెంకటేశ్వర్లు, సెక్రటరీ చంద్రశేఖర్, పిట్ కార్యదర్శి గణేష్, కార్యవర్గసభ్యులు రమేష్, గౌతమ్, పరంజ్యోతి శ్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !