మన్యం న్యూస్ కరకగూడెం: మండల పరిధిలోని కొర్నవెల్లి గ్రామానికి చెందిన పోలెబోయిన.శంకరయ్య దశదినకర్మలకు బిఅర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రావుల.సోమయ్య గౌడ్, చిట్టి.మల్లెష్ హాజరై అయన చిత్రపటనికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించి,కుటుంబ సభ్యులు ఓదార్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోరనవల్లి గ్రామంలోని సమ్మక్క సారలమ్మ ఆలయ పూజారిగా ధర్మకర్తగా సుదీర్ఘ కాలం పాటు పనిచేసే అనారోగ్యంతో మృతి చెందడంతో రెండు జిల్లాల భక్తులకు తీరని లోటు అని అన్నారు. ఈ కార్యక్రమంలో బూర్గంపాడు వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కొమరం. రాంబాబు, ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు పాయం.రాజబాబు, లక్ష్మణరావు,చందా. వసంతరావు తదితరులు పాల్గొన్నారు.
