మన్యం న్యూస్: జూలూరుపాడు, సెప్టెంబర్ 17, అంగన్వాడీ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి, వైరా నియోజకవర్గ నాయకులు లకావత్ గిరిబాబు కి మండలానికి చెందిన అంగన్వాడి కార్యకర్తలు ఆదివారం వినతిపత్రం అందజేశారు. సానుకూలంగా స్పందించిన గిరిబాబు వారి సమస్యలను ముఖ్యమంత్రి కేసీఆర్, వైరా ఎమ్మెల్యే రాములు నాయక్, ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ తాత మధుసూదన్ రావు, ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, జిల్లా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ దృష్టికి తీసుకెళ్తానని, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో స్రవంతి, లలిత, సొసైటీ డైరెక్టర్ హేమ్లా నాయక్, వీరు నాయక్ తదితరులు పాల్గొన్నారు.
