- సింగరేణికి మోడీనే శత్రువు
- బీజేపీకి డిపాజిట్లు గల్లంతు చేయాలి
- కాంగ్రెస్ నేతలు డబ్బులు ఇస్తే తీసుకోండి, ఓటు మాత్రం బీఆర్ఎస్కే వేయండి
- కాంగ్రెస్ లో సీఎం ఎవరో గ్యారంటీ లేదు
- బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీరామారావు
హైదరాబాద్ : దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో అద్భుత పాలన సాగుతుంటే.. బీజేపీ మాత్రం కులం, మతం పేరుతో ప్రజల మధ్య చిచ్చు పెట్టాలని ప్రయత్నిస్తోందని మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. మోడీ ప్రభుత్వం హిందూముస్లింలు అని పంచాయతీలు పెట్టి ఆ మంటలతో చలి కాచుకోవాలనే ప్రయత్నిస్తుందని విమర్శించారు . భద్రాద్రి కొత్తగూడెం బీజేపీ జిల్లా అధ్యక్షులు కోనేరు చిన్ని బీఆర్ఎస్లో చేరారు. కోనేరు చిన్నికి కండువా కప్పి కేటీఆర్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈసందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. బీజేపీ తెలంగాణ, ఏపీకి ఏ వర్గానికి చేసిందేమీ లేదు. రాబోయే ఎన్నికల్లో మళ్లీ గెలవాలని కుయుక్తులు పన్నుతోంది. కేసీఆర్ సెప్టెంబర్ 17వ తేదీన జాతీయ సమైక్యత దినం చేయడం కేంద్రానికి నచ్చలేదు. కుల, మతాల మధ్య చిచ్చు పెట్టి ఆ మంటల్లో చలి కాగాలని మోడీ ప్రభుత్వం చూస్తోంది. మోడీ దేశాన్ని దోచి అదానీకి కట్టబెడుతున్నరు. కిషన్‌రెడ్డికి తెలంగాణ రాష్ట్రంపై అభిమానం ఉంటే ఇక్కడి నిరుద్యోగ యవతకు ఉద్యోగాలు ఇవ్వాలని మోడీ ఇంటి ముందు ధర్నాచేయాలి. సిలిండర్ ధర పన్నెండు వందలకు పెంచిన మోడీకి డిపాజిట్ రాకుండా చేయాలి. మతం పేరిట చిల్లర రాజకీయాలు చేసుడే మోడీకి తెలుసు. రజాకార్ సినిమాతో పాత గాయాలు గెలుకుతున్నరు. దేశానికి చేసిందేమీ లేక భావోద్వేగాలతో బీజేపీ ఆడుకుంటోంది.
సిగ్గులేకుండా ఒక్క ఛాన్స్
సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ వచ్చి సిగ్గులేకుండా ఒక్క ఛాన్స్ అంటున్నారు. 11సార్లు అధికారం ఇస్తే ఏం చేశారు.అడ్డగోలు వాగ్దానాలు ఇస్తున్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఇవ్వని వారు ఇక్కడ 4వేల పెన్షన్ ఇస్తామంటే నమ్ముతారా..? కాంగ్రెస్‌లో సీఎం అయ్యేది ఎవరో కూడా గ్యారంటీ లేదు.అలాంటి పార్టీ ఆరు గ్యారంటీలు ఇస్తోంది. పొరపాటునో, గ్రహపాటునో కాంగ్రెస్‌కు ఓటేస్తే రాష్ట్రం పాతాళంలోకి వెళ్లింది. నీరు, కరెంట్, ఎరువులు, విత్తనాల కోసం క్యూ గ్యారంటీ, రైతుబంధుకు కూడా కాంగ్రెస్ స్వస్తి పలకుతుంది. మాయమాటలు చెప్పి కర్ణాటకలో అధికారంలోకి వచ్చారు. దళితుల సబ్ ప్లాన్ నిధులు దారి మళ్లించారు. కర్ణాటకలో విద్యుత్ సంక్షోభంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అభివృద్ధికి పైసా లేదని డీకే శివకుమార్ చెబుతున్నారు. రాహుల్ వచ్చినా.. మోదీ వచ్చినా తెలంగాణ అభివృద్ధిని కాదు.కాంగ్రెస్‌కు ఓట్ల యావ తప్పా.. రాష్ట్రాన్నిఅభివృద్ధి చేయలేదు.పార్టీ మారిన నేతలకు ఏం అన్యాయం జరిగింది. ఖమ్మంలో కాంగ్రెస్ నేతలు డబ్బులు ఇస్తే తీసుకోండి, ఓటు మాత్రం బీఆర్ఎస్కే వేయండి’’ అని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఖమ్మంలో కాంగ్రెస్ నేతలు డబ్బులు ఇస్తే తీసుకోండి, ఓటు మాత్రం బీఆర్ఎస్కే వేయండి’’ అని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు అధ్యక్షతన జరిగిన సభలో మంత్రి పువ్వాడ అజయ్ పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
………….