మన్యం న్యూస్ మణుగూరు:
మణుగూరు మండలంలోనీ హనుమాన్ ఫంక్షన్ హాల్ నందు మండల అధ్యక్షులు పీరినాకి నవీన్ ఆధ్వర్యంలో టి.పి.సి.సి సభ్యులు,నియోజకవర్గ కన్వీనర్ డాక్టర్.చందా సంతోష్ కుమార్ అధ్యక్షతన ఆదివారం నాడు తుక్కుగూడలో జరిగిన విజయభేరీ భారీ బహిరంగ సభ కార్యక్రమంలో భాగంగా 6 గ్యారంటీ పధకాలను ప్రకటించడం జరిగింది అన్నారు.వీటిని తెలంగాణ రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలలో గడప గడపకు తెలియజేయాలనే ఉద్దేశ్యంతో ఈ యొక్క ఆవిష్కరణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భద్రాచలం ఎమ్మేల్యే పొదెం వీరయ్య,పినపాక నియోజకవర్గ ఇన్చార్జి,టి.పి.సి.సి ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి పాల్గొని 6 గ్యారెంటీ స్కీములతో కూడిన అభయహస్తం కరపత్రాన్ని విడుదల చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,తెలంగాణ ప్రజల కోసం ప్రకటించిన 6 గ్యారెంటీ పథకాలు అమలు చేస్తామన్నారు.ఈ కార్యక్రమం లో టీ పి సి సి సభ్యులు తాళ్లూరి చక్రవర్తి శేకర్,మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, మైనారిటీ జిల్లా అధ్యక్షులు మహమూద్ ఖాన్,నియోజక వర్గం కో ఆర్డినేటర్ కాటిబోయిన నాగేశ్వర రావు, యూత్ అద్యక్షులు కోర్సా ఆనంద్,యూత్ జనరల్ సెక్రటరీ మిట్టపల్లి నితిన్,డి సి సి తుళ్ళూరి బ్రహ్మయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ సుధాకర్ రెడ్డి,బెల్లం కొండ వాసు దేవ, పినపాక నియోజక వర్గం ఏడు మండలాల అద్యక్షులు, నియోజకవర్గ నాయకులు, బట్టా విజయ గాంధీ, పోలెబోయిన శ్రీవాణి,కణితి కృష్ణా,ముద్ద రాజు,సీనియర్ నాయకులు గాదె కేశవ రెడ్డి, మహిళలు,కార్యకర్తలు,అభిమానులు తదితరులు పాల్గొన్నారు.