* పని అయితదని వస్తే పడిగాపులు
*క్రాప్ లోన్ కేవైసీ కైతే ఐదు, ఆరు రోజులు తిరగాల్సిందే.
*పార్కింగ్ ప్లేస్ లేదు, టాయిలెట్ సౌకర్యం లేదు.
*అవస్థ పడుతున్న ఎస్బిఐ ఇల్లందు బ్రాంచ్ కస్టమర్లు
మన్యం న్యూస్ ఇల్లందు రూరల్:- ఆపతుందని డబ్బులకోరకు సిటీలోని సర్కారు బ్యాంకుకోస్తే లైన్లో నిల్చోపెట్టి నిల్చిపెట్టి ఈ రోజు పని అవదు మళ్ళీ రేపు రా అంటూ ఇంటికి పంపుతున్నారు అంటూ ఇల్లందు మండలంలోని పలువురు రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఇల్లందు ఎస్బిఐ బ్రాంచ్ అసౌకర్యాల పట్ల కస్టమర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు .బ్యాంక్ అకౌంట్ కు ఫోన్ నంబర్ లింక్ చేయటం, ఆధార్ లింక్ చేయటం, కొత్త ఏటీఎం కొరకు అప్లయ్ చేయటం లాంటి చిన్న పని కొరకు అయిన సరే ఒకటి రెండు రోజులు బ్యాంక్ చుట్టూ తిరగాల్సి వస్తోంది అంటున్నారు. ఖరీఫ్ సీజన్ క్రాప్ లోన్స్ కొరకు అవసరం అయిన కేవైసీ అవాలంటే ఐదు ఆరు దినాలు బ్యాంక్ చుట్టూతా తిప్పుకుంటూన్నారు అంటూ ఇల్లందు మండల రైతులు, బ్యాంక్ వినియోగ దారులు తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. బ్యాంక్ లో ఎక్కువ లావాదేవీలు జరిగే కౌంటర్స్ లలో తెలుగు తెలియని బ్యాంక్ సిబ్బందిని విధులలో ఉండటం వల్ల తెలుగు తప్ప వేరే బష తెలియని రైతులు, మిగతా బ్యాంక్ వినియోగదారులు సంప్రదింపులు చేయాలంటే అయోమయ స్థితి కి లోనవుతున్నారు. పనిగాక పడిగాపులు కాస్తున్న కస్టమర్స్ కు టాయిలెట్స్ లేకపోవటం వలన మహిళా కస్టమర్స్ తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. బ్యాంకు వచ్చే వినియోగదారులు వారి వాహనాలు పార్కింగ్ చేయటానికి సరైన స్థలం లేకపోవటంతో బ్యాంక్ పక్కన ఉన్న దుకాణాల ముందు పార్కింగ్ చేయాల్సి వస్తుంది. దాంతో దుకాణ దారులకు బ్యాంక్ కు వచ్చే కస్టమర్స్ కు మధ్య వివాదం తలెత్తుతున్నాయి. తక్షణమే బ్యాంకు అధికారులు దృష్టిసారించి బ్యాంకు సేవలలో జాప్యం లేకుండా చూడాలని కోరుతున్నారు.
నేను మామిడి గూడెం నుంచి వచ్చాను. గత ఏడు రోజులుగా బ్యాంక్ కు వస్తున్నాను. క్రాప్ లోన్ కావాలంటే కేవైసి పూర్తిచేయాలని అంటున్నారు. బ్యాంక్ చుట్టూ తిరిగి తిరిగి యాస్టకొస్తుంది. ఇంటివద్ద మిగతా వ్యవసాయ పనులు వదులుకుని తిరుగుతుంటే ఇబ్బందిగా ఉంది. రామకృష్ణ,ఖాతా దారుడు,మామిడి గూడెం
—-
బ్యాంక్ అకౌంట్ కు ఫోన్ నంబర్ అటాచ్ చేయటం, ఏటీఎం కార్డ్ కొరకు అప్లయ్ చేసేందుకు బ్యాంక్ కు వచ్చాను. మూడు రోజులుగా బ్యాంకు చుట్టూ తిరుగుతున్నాను. తెలుగు తెలియని బ్యాంక్ సిబ్బందితో సమస్య ఎదురైంది. సుకన్య ఆంబజార్, ఇల్లందు.