మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
బిఎస్ఎన్ఎల్ ద్వారా జిల్లాలో సెల్ సిగ్నల్ కవరేజ్ లేని 32 గ్రామాలలో బిఎస్ఎన్ఎల్ 4-జి
సెల్ టవర్స్ నిర్మించనున్నట్లు జిల్లా కలెక్టర్
డాక్టర్ ప్రియాంక అల తెలిపారు. మంగళవారం ఐడిఓసి కార్యాలయంలో నెట్ వర్క్ లేని గ్రామాల్లో సెల్ టవర్లు నిర్మాణంపై బి యస్ ఎన్ యల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. సెల్ టవర్లు నిర్మాణానికి గుర్తించిన గ్రామాల నుండి 2 గుంటల భూమి టవర్స్ నిర్మించుటకు కేటాయింపు చేయాలని బి ఎస్ ఎన్ ఎల్ అధికారులు జిల్లా కలెక్టర్ ను కోరడం జరిగింది. నేటి రోజుల్లో సెల్ అంతర్జాల సేవలు ప్రజలకు చాలా అవసరమని ప్రభుత్వ సేవలు పొందేందుకు ప్రాధాన్యత బట్టి టవర్లు నిర్మాణానికి భూ కేటాయింపు చేస్తామని చెప్పారు. జిల్లాలో 26 గ్రామాలలో రెవిన్యూ అధీనంలోని గ్రామం నుండి 2 గుంటల భూమిని కేటాయిచడం జరిగుతుందని చెప్పారు. 6 గ్రామాలు వ్యవసాయ శాఖ పరిధిలో ఉండడం వలన వ్యవసాయ అధికారులతో మాట్లాడి త్వరలో భూమి కేటాయింపు అయ్యేలా చర్యలు తీసుకుంటామనని చెప్పారు.
ఈ సమావేశంలో డిఆర్వో రవీంద్ర నాధ్,
బీఎస్ ఎన్ ఎల్ డిజిఎం నవీన, ఏజీఎం
శ్రీనివాసరావు, ఎస్ డి ఈ సుధీర్ తదితరులు పాల్గొన్నారు.