ఖర్చులపై అవగాహన కలిగి ఉండాలి -సిఎఫ్ఎల్ కౌన్సిలర్స్
*ఆర్థిక అక్షరాస్యత పై గ్రామ ప్రజలకు అవగాహన కార్యక్రమం
మన్యం న్యూస్, అశ్వారావుపేట, సెప్టెంబర్, 19: మండలంలోని కావిడి గుండ్ల గ్రామపంచాయతీలో గవర్నర్ దత్తత గ్రామమైన గోగులపూడి గ్రామంలో ఆర్థిక అక్షరాస్యత పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సౌజన్యంతో లీడ్ బ్యాంకు వారి ఆధ్వర్యంలో విడ్స్ ఎన్జీవో సభ్యులు కౌన్సిలర్స్ వి అంజి బాబు, డి చంటి లుఅవగాహన కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలకు బ్యాంకు సేవలపై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరు కూడా బ్యాంక్ అకౌంట్ యూస్ చేయాలని, బ్యాంక్ అకౌంట్ ద్వారా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఇన్సూరెన్స్ ఉపయోగించుకోవాలని, ఆర్థిక సైబర్ నేరాలు జరగకుండా జాగ్రత్తలు వహించాలని, సంపాదించే సొమ్మును నష్టపోవద్దని ఖర్చులపై అవగాహనతో ఆర్థికంగా స్థిరపడాలని బ్యాంకులు సంబంధించిన అనేక విషయాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సెక్రెటరీ రామకృష్ణ, గ్రామ దీపిక బాగ్యలక్ష్మి, డ్వాక్రా మహిళలు, గ్రామపంచాయతీ సిబ్బంది పలువురు పాల్గొన్నారు.