మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆదేశాల మేరకు రామవరం 14 నెంబర్
పి హెచ్ సి ఆధ్వర్యంలో మున్సిపాలిటీ పరిధిలోని గురుకుల పాఠశాలలో విద్యార్థిని, విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణ ,సీజనల్ వ్యాధుల నిర్మూలన కోసం హెల్త్ క్యాంప్ నిర్వహించారు. మంగళవారం స్థానిక గురుకుల పాఠశాలలో 14 నెంబర్ పి హెచ్ సి డాక్టర్
ఈ.రాము ఆధ్వర్యంలో విద్యార్థుల నుండి రక్త నమూనాలను సేకరించి డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ తదితర వైద్య పరీక్షలు నిర్వహించి వారికి ఉచిత మందులు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి విద్యార్థి వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ పరిశుభ్రమైన ఆహార పదార్థాలు తీసుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో సి ఓ శ్రీనివాస్, డి పద్మావతి, రాజేశ్వరి, లక్ష్మి, మంజుల, సుదర్శన్, రాజమణి, విద్యార్థులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.