UPDATES  

 కెసిఆర్ సారో కనుకరించయ్యా…

కెసిఆర్ సారో కనుకరించయ్యా…
* పొర్లు దండాలు..మోకాళ్ళపై నిల్చోని నిరసన
* తొమ్మిదో రోజుకు చేరుకున్న అంగన్వాడీల సమ్మె
* అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించండి
* ఏఐటియుసి జిల్లా కార్యదర్శి కంచర్ల జమలయ్య

మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
కెసిఆర్ సారో.. మీకు దండం పెడతాం మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని అంగన్వాడీ టీచర్లు ఆయాలు వినూత్న రీతిలో తమ నిరసనను వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి పనిభద్రల కల్పించాలని కనీస వేతనం రూ.26వేలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీ సిబ్బంది నిర్వహిస్తున్న నిరవధిక సమ్మె మంగళవారం నాటికి తొమ్మిదో రోజుకు చేరుకుంది. సమ్మె సందర్భంగా కలెక్టరేట్ ధర్నా చౌక్ లో నిరసన శిభిరం ఏర్పాటు చేసి వివిధ రూపాయల్లో ఆందోళనా, నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. కలెక్టరే కార్యాలయం ఎదుట పోర్లు దండాలతో కొందరు మరికొందరు మోకాళ్ళపై నిల్చోని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఏఐటియుసి జిల్లా కార్యదర్శి కంచర్ల జమలయ్య మాట్లాడుతూ అంగన్వాడీ సిబ్బంది పట్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని అందులో బాగంగానే కేంద్రాలపై దాడులకు పూనుకుంటూ స్వాదీనం చేసుకుంటున్నారని విమర్శించారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా విధులు నిర్వహిస్తుండటంతోపాటు ప్రభుత్వ పథకాల ప్రచారంలో కీలక పాత్ర పోషిస్తున్న అంగన్వాడీలను ఏండ్ల తరబడి టెంపరరీ ఉద్యోగులుగానే పరిగణిస్తూ గౌరవ వేతనాలు చెల్లిస్తుండటం సరైందికాదన్నారు. తొమ్మిది రోజులుగా సమ్మె చేస్తుంటే కనీసం చర్చలకు ఆహ్వానించి సమ్మె నివారణ చర్యలు చేపట్టకపోవడం ప్రభుత్వ నిరంకుశపాలనకు నిదర్శనమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి న్యాయమైన డిమాండ్లు పరిష్కరించడం ద్వారా సమ్మెను నివారించాలని కోరారు. కార్యక్రమంలో అసోషియేషన్ల నాయకురాళ్ళు గోనె మణి, ప్రమీల, రూప, సరోజ, విజయమ్మ, లలిత, కె.నాగమణి, పద్మావతి, సుశీల, రజిత, జమున తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !