మన్యం న్యూస్,చండ్రుగొండ, సెప్టెంబర్19: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతులకు రుణమాపీ పథకాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని గానుగపాడు సోసైటి చైర్మన్ చెవుల చందర్రావు అన్నారు. మంగళవారం స్థానికి డిసిసిబి బ్యాంకు నందు గానుగపాడు సోసైటి రైతులకు రుణమాపీ నగదును ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….రైతులు రుణాలతో వ్యవసాయ పెట్టుబడులను పెట్టి. సాగును సులభం చేసుకోవాలన్నారు. దశలవారీగా రుణమాపీని ప్రభుత్వం రైతులకు అందిస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో డిసీసీబి మేనేజర్ రాగమయి, సోసైటీ సీఈఓ లంకా నరసింహరావు, బ్యాంకు సిబ్బంది, సోసైటీ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.