మన్యం న్యూస్,ఇల్లందు:ఇల్లందు నూతనంగా బస్ డిపోగా రూపాంతరం చెందిన నేపథ్యంలో మున్సిపాలిటీ పరిధిలో ప్రధాన కూడళ్లలో బస్సుషెల్టర్ లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ఇల్లందు మున్సిపల్ పాలకవర్గం జిల్లా కలెక్టర్ ప్రియాంక అలాదృష్టికి తీసుకెళ్లగా వెంటనే ఎనిమిది బస్ షెల్టర్లు మంజూరు చేయడం జరిగిందని మున్సిపల్ ఛైర్మెన్ దమ్మాలపాటి వెంకటేశ్వరావు తెలిపారు. ఈ సందర్భంగా బస్ షెల్టర్ల నిర్మాణం చేపడుతున్న క్రమంలో మంగళవారం ఇల్లందు మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు పనులను పర్యవేక్షించారు. త్వరగతిన పనులు పూర్తిచేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఒకటవ వార్డు కౌన్సిలర్ వారారవి, వినోద్ తదితరులు పాల్గొన్నారు.