మన్యం న్యూస్ దుమ్ముగూడెం సెప్టెంబర్ 19::
18 సంవత్సరాల నిండిన అర్హులు ఓటరుగా నమోదు చేసుకోవాలని దుమ్ముగూడెం మండల ఎంపీడీవో ముత్యాలరావు అన్నారు. మంగళవారం మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల లో విద్యార్థులకు ఓటర్ అవేర్నెస్ ప్రోగ్రాం ఇన్చార్జి ప్రిన్సిపల్ మల్లికార్జునరావు అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంపీడీవో మాట్లాడుతూ..18సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క యువతి,యువకుడు ఫార్మ్ 6ద్వారా ఓటు హక్కు ను నమోదు చేసుకుని వినియోగించుకోవాలని సూచించారు.యువత ఓటును అమ్ముకోవద్దని నిజమైన ప్రజా సేవచేసే నాయకులను ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. మీ గ్రామాలలో ఓటు హక్కు నమోదు గురించి తెలియపరచాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రెటరీ సందీప్, అధ్యాపకులు కే శ్రీనివాస్, బాబురావు, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి శ్రీనివాస్, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.