- మణుగూరు లో అఖిలపక్ష పార్టీల భేటీ
- బొగ్గు ముఠా కార్మికులు,కోల్ ట్రాన్స్పోర్ట్ గుమస్తా కార్మికులతో సమావేశం
- కార్మికులకు వెంటనే అగ్రిమెంట్ చేయాలని డిమాండ్
- మన్యం న్యూస్ మణుగూరు:
మణుగూరు మండలం లోని సిపిఐ పార్టీ కార్యాలయంలో బొగ్గు ముఠా గుమస్తా కార్మికుల కు అగ్రిమెంట్ చేయాలని కోరుతూ,మణుగూరు అఖిలపక్ష పార్టీ రాజకీయ నాయకులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో బి అయోధ్య సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు,కే.వెంకటేశ్వరరావు,చందా సంతోష్,కాటబోయిన. నాగేశ్వరరావు,ముత్యాల.వెంకటేశ్వరరావు,లింగంపల్లి.రమేష్ బీజేపీ,ఆర్.మధుసూదన్ రెడ్డి సిపిఐ ఎంఎల్ ప్రజాపంద, మిడిదొడ్ల.నాగేశ్వరరావు,సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ,ఉప్పు తల.వెంకటేశ్వరరావు సిపిఎం, కూచిపూడి బాబు తెలుగుదేశం వెలగలపల్లి జాన్ ఐఎన్ టియుసి తదితర నాయకులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,గత 35 సంవత్సరాల నుండి కార్మికుల పక్షాన ఏఐటీయూసీ,సిపిఐ పార్టీ నాయకత్వంలో కార్మిక హక్కుల కోసం అనేక అగ్రిమెంట్లు చేశామని బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన తర్వాత కార్మికుల ను చీల్చి అధికార పార్టీకి మద్దతుగా బిటిపిఎస్ కాంట్రాక్టులతో అగ్రిమెంట్ చేయిస్తూ,రెండు సంవత్సరాల నుండి కార్మికులకు అగ్రిమెంట్ చేయకుండా అనేక ఇబ్బందులు గురి చేస్తున్నారని అన్నారు.గుమస్తాలకు రెండు సంవత్సరాల నుంచి ఒక్క రూపాయి కూడా చెల్లించే పరిస్థితి లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.రేక్కాడితే కాని డొక్కాడని,కష్టం చేసే కార్మికుల నోరు కొట్టే పద్ధతి మంచిది కాదన్నారు.కాంట్రాక్టర్ ముందుకు వచ్చి అగ్రిమెంట్ చేయాలని లేని పక్షంలో ఆందోళన ఉదృతం చేస్తామని వారు హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు ఆర్ లక్ష్మీనారాయణ,సిపిఐ మణుగూరు మండల పట్టణ కార్యదర్శులు జంగం మోహన్ రావు,దుర్గేల సుధాకర్,ఎస్కే సర్వర్,అక్కి.నరసింహారావు,గురజాల గోపి బొగ్గు ముఠా అధ్యక్ష కార్యదర్శులు జక్కుల రాజబాబు శ్రీకాకుళం వీరమల్లు,గుమస్తా సంఘం అధ్యక్ష కార్యదర్శులు భీమరాజు కృష్ణ,తోట రమేష్, బొగ్గు ముఠా గుమస్తా కార్మికులు పాల్గొన్నారు.