UPDATES  

 గెలుపు ఖాయం మెజారిటీనే ధ్యేయం

  • గెలుపు ఖాయం మెజారిటీనే ధ్యేయం
  • తెలంగాణ ప్రజలంతా సీఎం కేసీఆర్ తోనే
  • ప్రతి ఒక్కరూ ఒక సైనికునిల పని చేయాలి
  • బిఆర్ఎస్ సీనియర్ నాయకులు ఎడ్ల శ్రీను

మన్యం న్యూస్ మణుగూరు:

మణుగూరు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు శేషగిరి నగర్ 126 వ బూత్ ఇంచార్జి వేముల లక్ష్మయ్య ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన బూత్ కమిటీ సమావేశానికి ముఖ్య అతిథులుగా బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ మండల అధ్యక్షులు ఎడ్ల శ్రీనివాస్ హాజరయ్యారు.ఈ సందర్బంగా ఎడ్ల శ్రీను,బూత్ పరిధి లోని 100 ఓట్ల ఇన్చార్జిలతో మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని, పినపాక నియోజకవర్గంలో ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమా లను గడపగడపకు తీసుకెళ్లి, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వ విప్ రేగా కాంతారావు ను భారీ మెజారిటీతో గెలిపించేలా,ఈ బూత్ నుండి అత్యధిక ఓట్ల పోలింగ్ జరిగే దిశగా ప్రతి ఒక్కరు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు.తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ భారతదేశం లోనే ఏ రాష్ట్రంలో జరగనటువంటి అభివృద్ధి, సంక్షేమ పథకాలను మన రాష్ట్రంలో ప్రవేశ పెడుతూ,పేద ప్రజలకు కావలసినటువంటి అవసరాలను తీర్చుతూ,పేదల గుండెల్లో సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్నారు అన్నారు. ప్రజలందరూ కేసీఆర్ వైపే ఉన్నారని,ప్రతిక్షణం ప్రజల సమస్యలపై స్పందించి పనిచేసే మన రేగా కాంతారావును రాబోయే ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించే దిశగా అందరు కలిసి కృషి చేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో, ఎస్సీ సెల్ టౌన్ అధ్యక్షులు బూర్గుల సంజీవరావు,వేమూరి రఘు,బోయిన భూమయ్య, బుచ్చయ్య,గుంజ.సాంబ,రత్నా చారి,శ్రీను,గూగుల్లో దస్మా, రాసి మల్ల రాణి,ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !