మన్యం న్యూస్,ఇల్లందు:సమీకృత మత్స్య అభివృద్ధి పథకం ద్వారా వందశాతం రాయితీపై ఉచిత చేపపిల్లల పంపిణి కార్యక్రమం టేకులపల్లి మండల ఎంపీడీఓ కార్యాలయం నందు బుధవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ హరిసింగ్ నాయక్ హాజరై ఉచిత చేపపిల్లలను పంపిణీ చేశారు. మత్సకారులకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, కేసీఆర్ ప్రభుత్వంలో అన్నివర్గాల ప్రజలకు సంక్షేమఫలాలు అందాయని అన్నారు. ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగల రాజేందర్, ఎంపీపీ భూక్య రాధా, ఎంపీడీవో వీరబాబు, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు బొమ్మెర్ల వరప్రసాద్, మండల ప్రధాన కార్యదర్శి బోడబాలు, జిల్లా నాయకులు బానోత్ రామానాయక్, మండల అధికార ప్రతినిధి బానోత్ కిషన్ నాయక్, స్థానిక ఎంపీటీసీ అప్పారావు, బర్మావత్ శివకృష్ణ, దళపతి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.τ